నటుడు రాజ్ తరుణ్ గత కొన్ని నెలలుగా పలు సినిమాలను విడుదల చేసారు, అయితే విడుదలకు ముందే కొంత బజ్ సృష్టించిన ఏకైక చిత్రం “భలే ఉన్నాడే”. అయితే ఈ సినిమా కూడా ప్రేక్షకులను మరోసారి థియేటర్లలోకి తీసుకురావడంలో విఫలమైంది.
థియేటర్లలో ప్లాప్ టాక్ వచ్చిన తర్వాత, ఈ చిత్రం ఇప్పుడు అక్టోబర్ 03, 2024న ETV విన్ OTT ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ అవుతుంది.
రాజ్ తరుణ్, మనీషా కంద్కూర్, అభిరామి, కృష్ణ భగవాన్, వీటీవీ గణేష్, రచ్చ రవి, శ్రీకాంత్ అయ్యంగార్, గోపరాజు రమణ, హైపర్ ఆది ఈ చిత్రంలో ప్రధాన తారాగణం.
మారుతీ టీమ్‌తో కలిసి రవికిరణ్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్‌వి కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జె శివసాయి వర్ధన్ దర్శకుడు. శేఖర్ చంద్ర సంగీతం సమకూర్చగా, శ్రీకాంత్ పట్నాయక్ ఎడిటర్. సిద్దం మనోహర్ ఛాయాగ్రహణం అందించారు.