కొన్ని చిన్న-బడ్జెట్ చిత్రాలు అస్సలు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైనప్పటికీ మంచి కంటెంట్‌తో ప్రేక్షకుల నుండి ప్రేమను అందుకుంటాయి. అలాగే “35 చిన్న కథ కాదు” సినిమా ఇటీవల రానా దగ్గుబాటి ప్రసెంట్ చేసారు. ప్రీమియర్ షోల నుండే సినిమాకి చాలా మంచి స్పందన వచ్చింది.
చాలా పాజిటివ్ టాక్‌తో, ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులకు నచ్చింది. ఇంక ఇప్పుడు అక్టోబర్ 02, 2024న గాంధీ జయంతి సందర్భంగా ఆహా వీడియో OTT ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ కి సిద్ధంగా ఉంది.
ఈ సినిమాలో నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్ రాచకొండ, గౌతమి, భాగ్యరాజ్, కృష్ణ తేజ, అరుణ్ దేవ్, అభయ్, అనన్య నటించారు.
నంద కిషోర్ ఈమాని ఈ చిత్రానికి రచయిత మరియు దర్శకుడు. సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు. వివేక్ సాగర్ సంగీతం సమకూర్చగా, నికేత్ బొమ్మి ఛాయాగ్రహణం అందించారు.