నెట్‌ఫ్లిక్స్ OTT ప్లాట్‌ఫామ్ భారతదేశంలో చాలా సినిమాలు మరియు సిరీస్‌లను రిలీజ్ చేస్తుంది అలాగే వారు ఎక్కువ మంది సబ్స్కైబర్స్ ని పొందేందుకు భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో అవగాహనా కల్పించడం ప్రారంభించారు. వారు తమ ఒరిజినల్ సినిమాలు మరియు సిరీస్‌లను ఇతర భాషలలోకి కూడా డబ్ చేయడం ప్రారంభించారు.
ఈ ప్లాట్‌ఫామ్ నుండి కొన్ని నెలల క్రితం “దో పత్తి” అనే కొత్త చిత్రం గురించి అనౌన్స్మెంట్ చేసారు. అయితే ఇప్పుడు అక్టోబర్ 25, 2024న నెట్‌ఫ్లిక్స్ OTT ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కోసం సిద్ధంగా ఉందంటూ ఒక వీడియోను విడుదల చేసారు.
ఈ థ్రిల్లర్ చిత్రం లో కాజోల్, కృతి సనన్, షాహీర్ షేక్, తన్వీ అజ్మీ, బ్రిజేంద్ర కాలా మరియు మరికొంత మంది ఉన్నారు. అలాగే ఈ సినిమా తమిళ్, తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో కూడా ప్రసారం కానుంది.
ఈ చిత్రానికి కనికా ధిల్లాన్ రచయిత, శశాంక చతుర్వేది దర్శకుడు. కథా పిక్చర్స్‌తో కలిసి బ్లూ బటర్‌ఫ్లై ఫిల్మ్స్ బ్యానర్‌పై కృతి సనన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.