దళపతి విజయ్ నటించిన “ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్” భారీ అంచనాలతో విడుదలైంది కానీ ఆ చిత్రం అంచనాలను అందుకోవడంలో విఫలమైంది.
సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ ని వసూలు చేసినప్పటికీ, కథ పరంగా సినిమా ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో విఫలమైంది.
ఇంక ఇప్పుడు ఈ చిత్రం OTT లోకి వస్తోంది. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అక్టోబర్ 03, 2024న నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అవుతుంది.
ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం మరియు హిందీ బాషలో అందుబాటులో ఉంటుంది.
ఈ చిత్రంలో విజయ్, మీనాక్షి చౌదరి, జయరామ్, అజ్మల్ అమీర్, ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, స్నేహ, లైలా, పార్వతి నాయర్, వైభవ్, యోగి బాబు, ప్రేమి అమరెన్, తదితరులు నటించారు.
ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు, యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఎజిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ (పి) లిమిటెడ్ బ్యానర్‌పై కల్పాతి ఎస్ అఘోరం, కల్పాతి ఎస్ గణేష్ మరియు కల్పాతి ఎస్ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.