చాలా మంది కొత్త నటీనటులు యూట్యూబ్ వీడియోలతో పేరు సంపాదించుకుని ఆ తరువాత పెద్ద తెరపై నటుడిగా తమకంటూ ఒక ఇమేజ్‌ని సృష్టించుకున్నారు. అలాగే యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ డ్యాన్స్ వీడియోలు చేసి, కొన్ని యూట్యూబ్ సిరీస్‌లలో కనిపించి, ఇప్పుడు OTT చిత్రం “లీలా వినోదం”తో మన ముందుకు వస్తున్నాడు.
అనేక సార్లు వాయిదాలు పడిన తర్వాత, ఇప్పుడు ఈ చిత్రం ఈటీవీ విన్ OTT ప్లాట్‌ఫామ్‌లో డిసెంబర్ 19, 2024న రిలీజ్ అవుతున్నట్టు ప్రకటించారు.
ఈ సిరీస్ లో షణ్ముఖ్ జస్వంత్, అనఘా అజిత్, గోపరాజు రమణ, ఆమని, రూపా లక్ష్మి, శ్రవంతి ఆనంద్, మిర్చి ఆర్జే శరణ్, మహేందర్, శివ తుమ్మల, మధన్ మోహన్, చైతన్య గరికిన నటించారు.
శ్రీ అక్కియన్ ఆర్ట్స్ బ్యానర్‌పై శ్రీధర్ మారిసా నిర్మించిన ఈ తక్కువ బడ్జెట్ చిత్రానికి పవన్ సుంకర దర్శకుడు. టి.ఆర్.కృష్ణ చేతన్ సంగీతం అందించగా, అనుష్క కుమార్ ఛాయాగ్రహణం అందించారు.