లవ్, సితార సినిమా రొమాన్స్ మరియు ఫ్యామిలీ డ్రామా, ఇందులో శోభితా ధూళిపాళ ప్రధాన పాత్రలో నటించారు. నేరుగా OTT విడుదలైన ఈ సినిమాలో ఆమె ఇంటీరియర్ డిజైనర్ సితార పాత్రను పోషించింది. వందనా కటారియా దర్శకత్వం వహించిన ఈ చిత్రం హిందీ లో జీ5 OTT ప్లాటుఫామ్ లో సెప్టెంబర్ లో విడుదలైంది. ఇక ఇప్పుడు తెలుగు ఆడియో లో ఈరోజే విడుదల అయ్యింది.
ఈ సినిమా కథ ఏంటి అంటే పెళ్లిపై ఆసక్తి లేని ఒక స్వతంత్ర ఆలోచనలు ఉన్న అమ్మాయి అయిన తారా, ప్యాషనేట్ చెఫ్ అయిన అర్జున్‌ని కలిసిన తర్వాత తన మనసు మార్చుకుంటుంది. వారు తారా స్వగ్రామంలో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, కొన్ని అనుకోని పరిస్థితులు వారి వివాహాన్ని సవాలు చేస్తాయి. మరి అప్పుడు వాళ్ళు ఎం చేసారు అసలు వివాహం చేసుకున్నారా లేదా అనేదే మిగతా కథ.
“పొన్నియిన్ సెల్వన్ I మరియు II”, వెబ్ సిరీస్ “మేడ్ ఇన్ హెవెన్”, “ది నైట్ మేనేజర్” వంటి చిత్రాలతో గుర్తింపు సంపాదించుకున్న శోభిత ధూళిపాళ, సితార పాత్ర తో మంచి పేరు పొందింది. సిద్ధార్థ, అతని సినిమా లలో “ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్!” వంటి వెబ్ సిరీస్, అలాగే “ఆశ్రమ్”, చిత్రంలో కూడా నటించారు.
RSVP ప్రొడక్షన్స్, వందనా కటారియా మరియు శోభిత వంటి ప్రతిభావంతులైన తారాగణం మరియు సిబ్బందితో కలిసి చేసిన ఈ సినిమా ప్రతి ZEE5 వీక్షకుడికి ‘లవ్, సితార’ నచ్చుతుంది.