తమిళ చిత్ర పరిశ్రమ ఈ సంవత్సరం మొత్తం కష్టాల్లో ఉంది అలాగే ప్రేక్షకుల నుండి మంచి స్పందనను అందుకున్న చాలా తక్కువ సినిమాలు ఉన్నాయి అయితే వాటిలో ఒకటి ఇటీవల విడుదలైన “లబ్బర్ పండు”.
తక్కువ అంచనాలతో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులు ఇంక విమర్శకుల నుండి కూడా మంచి స్పందనను అందుకుంది. ఈ చిత్రం డిస్నీ+ హాట్‌స్టార్ ప్లాట్‌ఫామ్‌లో అక్టోబర్ 31, 2024న దీపావళి కానుకగా రిలీజ్ అవుతుంది. తమిళం తో పాటుగా తెలుగు, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో కూడా రిలీజ్ కి సిద్ధంగా ఉంది.
హరీష్ కళ్యాణ్, అట్టకత్తి దినేష్, స్వస్విక, సంజన కృష్ణమూర్తి, కాళి వెంకట్, బాల శరవణన్, గీతా కైలాశం, దేవదర్శిణి, జెన్సన్ దివాకర్ మరియు TSK ఈ చిత్రంలో నటించారు.
ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి తమిళరసన్ పచ్చముత్తు దర్శకత్వం వహించారు. దినేష్ పురుషోత్తమన్ సినిమాటోగ్రఫీ చేయగా, సీన్ రోల్డన్ సంగీతం సమకూర్చారు.