“96” లాంటి బ్లాక్ బస్టర్ చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడు సి.ప్రేమ్ కుమార్ తన తరువాత సినిమా కోసం 5 సంవత్సరాలకు పైగా గ్యాప్ తీసుకున్నాడు. ఇక ఇప్పుడు అతని ఇటీవలి చిత్రం “సత్యం సుందరం” తెలుగు లో అలాగే తమిళ్ లో “మెయ్యళగన్” పేరుతో విడుదలైంది, అతని మొదటి చిత్రం విడుదలైన 6 సంవత్సరాల తర్వాత.
రన్‌టైమ్ గురించి కొన్ని ఫిర్యాదులు ఉన్నప్పటికీ “సత్యం సుందరం” చాలా మంచి స్పందనను అందుకుంది ప్రేక్షకులనుండి. ఇక ఇప్పుడు, అక్టోబర్ 25, 2024న నెట్‌ఫ్లిక్స్ OTT ప్లాట్‌ఫామ్‌లో తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ మరియు హిందీ ఆడియోలలో స్ట్రీమింగ్ కోసం సిద్ధం గా ఉంది.
ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో అరవింద్ స్వామి, కార్తీ ప్రధాన పాత్రలలో నటించారు. రాజ్ కిరణ్, శ్రీ దివ్య, దేవ దర్శిని, జయప్రకాష్, కరుణాకరన్, ఇళవరసు ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై జ్యోతిక, సూర్య కలిసి నిర్మించిన ఈ చిత్రానికి సి.ప్రేమ్‌కుమార్ రచయిత మరియు దర్శకుడు. గోవింద్ వసంత సంగీతం సమకూర్చగా, మహేంద్రన్ జయరాజు ఛాయాగ్రహణం అందించారు.