మలయాళ పరిశ్రమ లో హిట్ పెయిర్ గా పేరుపొందిన షేన్ నిగమ్ ఇంకా మహిమా నంబియార్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం “లిటిల్ హార్ట్స్”. మలయాళం లో థియేటర్ లో రిలీజ్ కి మంచి స్పందనను అందుకుంది కానీ హిట్ మూవీ గా నిలవలేకపోయింది.
ముందుగా మలయాళం లో ఈ సినిమా ప్రైమ్ వీడియో లో రిలీజ్ చేసారు ఇక ఇప్పుడు ఆహా వీడియో OTT ప్లాట్‌ఫామ్ లో తెలుగు లో అక్టోబర్ 24, 2024న వస్తున్నట్లు ఒక పోస్టర్‌ను విడుదల చేశారు.
షేన్ నిగమ్, మహిమా నంబియార్‌లతో పాటు, ఈ చిత్రంలో షైన్ టామ్ చాకో, బాబురాజ్, జాఫర్ ఇడుక్కి, రమ్య సువి, రెంజి పనికర్, మాలా పార్వతి, పార్వతి బాబు, ఐమా రోస్మీ మరియు జాన్ కైపల్లిల్ కూడా నటించారు.
ఆంటో జోస్ పెరీరా, ఏబీ త్రీసా పాల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కైలాస్ సంగీతం సమకూర్చగా, ల్యూక్ జోస్ ఛాయాగ్రహణం అందించారు.