Swag Movie OTT: శ్రీవిష్ణు నటించిన లేటెస్ట్ మూవీ “స్వాగ్ ” OTT లోకి వచ్చేసింది

Swag Movie OTT

ఈ మద్యే విడుదలైన శ్రీవిష్ణు “స్వాగ్” సినిమా, ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం అక్టోబర్ 4న థియేటర్లలో విడుదలైంది ఇక ఇప్పుడు, ఆశ్చర్యకరంగా, మూడు వారాల్లో, ఇది ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయింది ఎలాంటి ముందస్తు అనౌన్స్మెంట్ లేకుండానే..

స్వాగ్‌కి మంచి స్పందన లభించింది, అయితే గందరగోళంగా ఉన్న స్క్రీన్‌ప్లే కారణంగా ఈ చిత్రం ఎక్కువ మంది ప్రేక్షకులను చేరుకోవడంలో విఫలమైంది.

ఎలాంటి ప్రకటన లేకుండా స్వాగ్ అక్టోబర్ 25, 2024న ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయింది. శ్రీవిష్ణు తన నటనతో పాటు పలు గెటప్‌లతో మెప్పించారు.

ఈ చిత్రంలో శ్రీవిష్ణు, రీతూ వర్మ, మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, రవిబాబు, గెటప్ శ్రీను, గోపరాజు రమణ తదితరులు నటించారు.

హసిత్ గోలి ఈ చిత్రానికి దర్శకుడు, వివేక్ సాగర్ సంగీతం అందించగా, వేదరామన్ శంకరన్ ఛాయాగ్రహణం, టి.జి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు