తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత బిజీ నటుల్లో సుహాస్ ఒకరు. అతను సంవత్సరానికి మూడు సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల విడుదలైన జనక అయితే గనక అందులో ఒక సినిమా.
సినిమాలో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉన్నప్పటికీ, సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద మాములు కలెక్షన్స్ ని మాత్రమే రాబట్టగలిగింది. ఇప్పుడు, ఈ కామెడీ డ్రామా OTT లోకి వస్తోంది.
జనక అయితే గనక నవంబర్ 08, 2024న ఆహా వీడియోలో రిలీజ్ అవుతుంది. ఈ చిత్రంలో సుహాస్, సంగీర్తన, వేనళ్ల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ మరియు ఇతరులు నటించారు.
సందీప్ బండ్ల ఈ చిత్రానికి రచయిత మరియు దర్శకుడు. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతం, సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ, కోదాటి పవన్ కళ్యాణ్ ఎడిటర్.