Pothugadda Movie OTT: ఈటీవీ విన్ లో నేరుగా రిలీజ్ అవుతున్న మరో కొత్త సినిమా “పోతుగడ్డ”

Pothugadda Movie OTT

పొలిటికల్ డ్రామా సినిమాలు ఎప్పుడైనా ఇంట్రస్టింగ్ గా ఉంటాయి, అలాగే ప్రస్తుత రాజకీయాలపై కొన్ని సెటైరికల్ చిత్రాలను కొన్ని సినిమాల్లో చూశాం. ఈ జానర్‌తో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు “పోతుగడ్డ” అనే కొత్త చిత్రం సిద్ధమవుతోంది.

ఈటీవీ విన్ OTT ప్లాట్‌ఫామ్, ఎక్కువ మంది ప్రేక్షకులను సంపాదించుకోవడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నది, ఇప్పుడు ప్రేమకథతో కూడా కలిపి ఈ కొత్త పొలిటికల్ డ్రామాతో వస్తోంది. ఈ చిత్రం జనవరి 30, 2025న ఈ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ అవుతుంది.

ఈ సినిమా లో శత్రు, పృధ్వీ దండముడి, విస్మయ శ్రీ, ఆడుకలం నరేన్, మరియు ప్రశాంత్ కార్తీ నటిస్తున్నారు.

24 సినిమా స్ట్రీట్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై అనుపమ చంద్ర కోడూరి మరియు డా. జి శరత్ చంద్ర రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి రాకేష్ వీరమ్ దర్శకత్వం వహించారు. మార్కస్.ఎం మరియు శ్రవణ్ భరద్వాజ్ సంగీతం సమకూర్చారు.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు