చాలా సంవత్సరాల తర్వాత, యంగ్ టైగర్ Jr.NTR దేవర పార్ట్ 1 తో బ్లాక్ బస్టర్ సాధించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 500 కోట్లకు పైగా కలెక్షన్లను వసులు చేసింది.
అయితే ఈ యాక్షన్ డ్రామా ఇప్పుడు OTT లోకి స్ట్రీమింగ్ కి సిద్ధంగా ఉంది. దేవర పార్ట్ 1 నెట్‌ఫ్లిక్స్‌లో నవంబర్ 08, 2024న రిలీజ్ అవుతుంది.
ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, శృతి మరాఠే, అజయ్, కలైయరసన్, మురళీ శర్మ, షైన్ టామ్ చాకో తదితరులు నటించారు.
ఈ చిత్రానికి దర్శకుడు కొరటాల శివ, సంగీతం అనిరుధ్ రవిచందర్, ఛాయాగ్రహణం రత్నవేలు అందించగా, సుధాకర్ మిక్కిలినేని-కొసరాజు హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు.