సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా వేట్టైయన్ ఎట్టకేలకు OTT లోకి రాబోతుంది. ప్రైమ్ వీడియో ద్వారా అధికారిక ప్రకటన వెలువడింది.
వేట్టైయన్ నవంబర్ 08, 2024న ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేయబడుతుంది అలాగే ఈ చిత్రం తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషలలో కూడా అందుబాటులో ఉంటుంది.
వెట్టైయన్‌లో రజనీకాంత్, మంజు వారియర్, అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి మరియు ఫహద్ ఫాసిల్ వంటి పెద్ద తారాగణం ఉన్నారు. వీరితో పాటు కిషోర్, రితికా సింగ్, దుషార విజయన్, అభిరామి, రోహిణి, రావు రమేష్, రక్షణ, తదితరులు కూడా నటించారు.
ఈ చిత్రానికి టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వం అందించారు, అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చగా, ఎస్ఆర్ కతిర్ సినిమాటోగ్రఫీ చేశారు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.