హిస్టారికల్ డ్రామా సిరీస్ “ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్” చాలా రోజుల కిందటే అనౌన్స్ చేసారు. అలాగే ఆ సిరీస్ సంబందించిన కొన్ని వీడియోలు YouTubeలో విడుదల చేయబడ్డాయి. అయితే, ఈ సిరీస్ దర్శకనిర్మాతలు OTT విడుదల తేదీని ప్రకటించడానికి కొంత సమయం తీసుకున్నారు.
సోనీలివ్ OTT ప్లాట్‌ఫామ్ ఇప్పుడు ఈ సిరీస్ యొక్క ట్రైలర్‌ను విడుదల చేసింది అలాగే ఈ సిరీస్ నవంబర్ 15, 2024 నుండి స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంటుందని ధృవీకరించింది.
ఈ హిస్టారికల్ డ్రామాలో సిధాంత్ గుప్తా, చిరాగ్ వోహ్రా, రాజేంద్ర చావ్లా, ఆరిఫ్ జకారియా, ఇరా దూబే, మలిష్కా మెండోన్సా, రాజేష్ కుమార్, ల్యూక్ మెక్‌గిబ్నీ, కార్డెలియా బుగేజా మరియు మరికొందరు నటించారు.
నిఖిల్ అద్వానీ ఈ సిరీస్‌కి దర్శకత్వం వహించాడు. దీనిని మోనిషా అద్వానీ మరియు మధు భోజ్వానీ నిర్మించారు. మలయ్ ప్రకాష్ ఛాయాగ్రహణం అందించారు, శ్వేతా వెంకట్ ఎడిటర్.