లైఫ్ స్టోరీస్ మరొక కొత్త ఈటీవీ విన్ ఒరిజినల్ మూవీ. ఈ మద్యే ట్రైలర్ విడుదలైంది అందులో ఆరు విభిన్న కథలు కనిపించాయి.
ఇక ఇప్పుడు లైఫ్ స్టోరీస్ నవంబర్ 07, 2024న ఈటీవీ విన్‌లో రిలీజ్ అవడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో సత్య కేతినీడి, షాలిని కొండేపూడి, దేవియాని శర్మ, M. వివాన్ జైన్, లక్ష్మీ సుంకర, రాజు గొల్లపల్లి హ్యారీ – గోల్డెన్ రిట్రీవర్, ప్రదీప్ రాపర్తి, గజల్ శర్మ, శరత్ సుసర్ల, స్వర్ణ డెబోరా, రాహుల్ తదితరులు నటిస్తున్నారు.
ఉజ్వల్ కశ్యప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, విన్నూ సంగీతం అందించగా, ప్రణవ్ ఆనంద ఛాయాగ్రహణం.
ACZUN ఎంటర్‌టైన్‌మెంట్, ప్లానెట్ గ్రీన్ స్టూడియోస్‌పై MM విజయ జ్యోతి లైఫ్ స్టోరీస్ మూవీని నిర్మించారు. లైఫ్ స్టోరీస్ అన్ని వర్గాల ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వబోతున్నాయి ఎందుకంటే ఇందులో అన్ని వర్గాల ప్రేక్షకులకు రిలేట్ అయ్యే విభిన్న కథలు ఉన్నాయి.