హెబ్బా పటేల్ నటించిన “తెలిసినవాళ్ళు” ఆహా వీడియోలో ‘ది గ్రేట్ ఇండియన్ సూసైడ్’ అనే కొత్త టైటిల్‌తో విడుదలైంది.
అయితే, ఇప్పుడు అదే పాత టైటిల్‌తో ఈటీవీ విన్‌లో రిలీజ్ అవుతుంది. “తెలిసినవాళ్ళు” సినిమా 07 నవంబర్ 2024న ఈటీవీ విన్‌లో రిలీజ్ కి సిద్ధం గా ఉంది.
ఈ చిత్రంలో రామ్ కార్తీక్, హెబ్బా పటేల్, వికె. నరేష్, పవిత్ర లోకేష్, జయ ప్రకాష్ తదితరులు నటించారు. విప్లవ్ కోనేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
ఈ చిత్రానికి సంగీతం శ్రీచరణ్ పాకాల, ఎడిటర్ ధర్మేంద్ర కాకరాల, సిరంజ్ సినిమా పతాకంపై విప్లవ్ కోనేటి ఈ చిత్రాన్ని నిర్మించారు.
“తెలిసినవాళ్ళు” యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందించబడింది కానీ ఆహా వీడియోలో సినిమా ప్రీమియర్ అయినప్పుడు వ్యూస్ నుండి మంచి స్పందనను పొందలేకపోయింది.