Bangarraju Movie Review: బంగార్రాజు మూవీ రివ్యూ

Bangarraju Movie Review: అక్కినేని ఫ్యామిలీ తండ్రా కొడుకులు కలిసి నటించిన బంగార్రాజు చిత్రం ఎట్టకేలకు థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. 2022 లో వచ్చిన మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా బంగార్రాజు మూవీని చెప్పుకోవచ్చు. సుపర్ నాచురల్ ఎలిమెంట్స్ కలిపి తెరకెక్కించిన ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ సినిమా విడుదలైన సందర్భంగా మరిన్ని విషయాలను తెలుసుకుందాం.

Bangarraju Movie Review

బంగార్రాజు చిత్రాన్ని కళ్యాన్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించారు. ఆయనే దీనికి కథను కూడా అందించారు. తండ్రీ కొడుకుల పాత్రలో నాగార్జున, నాగచైతన్య తెరమీద కూడా అదరగొట్టారు. క్రిత్తి షెట్టి ఈ సినిమాలో కొత్తగా, ఊరిపిల్లగా కనిపిస్తుంది. జీస్టూడియోస్, అన్నపుర్ణస్టూడియోస్ కలిసి ఈ సినిమాను సొంత బ్యానర్ పై ప్రొడ్యూస్ చేసాయి. అనూప్ రూబెన్స్ సంగీతం, జె. యువరాజ్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి.

కథ విషయానికి వస్తే.. సోగ్గాడు సినిమాకు సీక్వెల్ స్టైల్ గా ఈ సినిమా ఉంటుంది. నాగార్జున రమ్యకృష్ణ చనిపోయిన తరువాత కూడా తమ పిల్లల చుట్టూ ఉంటూ వారిని ఎలా సంరక్షిస్తారనే దాని చుట్టూ కథ తిరుగుతూ ఉంటుంది. నాగార్జునకు జోడీగా రమ్మకృష్ణ, ఐటం సాంగ్ లో ఫరియా అబ్దుల్లా అదరగొట్టారు. కుటుుంబ సమేతంగా కలిసి చూడదగిని సినిమా ఈ బంగార్రాజు.

సినిమా ఎలా ఉందంటే

పూర్తి విలేజ్ బ్యాక్ డ్రాప్ తో సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. నాగార్జున, నాగచైతన్య కలిసి అద్భుతంగా నటించారు. నాగార్జున, రమ్యకృష్ణ పాత్రలు ఎమోషనల్ గా ఆకట్టుకుంటాయి. ఫరియా అబ్దుల్లా ఐటం సాంగ్ తో కుర్రకారు మనసు దోచేస్తుంది. సంక్రాంతి సందర్భంగా వచ్చిన మంచి సినిమా ఈ బంగార్రాజు, ఆలస్యం చేయకుండా వెంటనే చూసెయ్యండి.

మూవీ రేటింగ్ : 3.5/5

ఇవి కూడా చూడండి: 

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు