ప్రఖ్యాత దర్శకుడు కె. విజయ భాస్కర్ “నువ్వు నాకు నచ్చావ్”, “మన్మధుడు”, “మల్లీశ్వరి” మొదలైన అద్భుతమైన చిత్రాలకు పేరుగాంచాడు.
చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత తన కొడుకుతో ఉషాపరిణయం అనే సినిమా చేశాడు. ఆ సినిమా ఆగస్ట్‌లో థియేటర్ లలో విడుదలైంది, అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేకపోయింది.
ఇక ఇప్పుడు రెండు నెలల తర్వాత, ఉషా పరిణయం నవంబర్ 14, 2024న ఈటీవీ విన్‌లో రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో శ్రీ కమల్, తన్వి ఆకాంక్ష, అలీ, సీరత్ కపూర్, వెన్నెల కిషోర్, శివాజీ రాజా, ఆమని, సుధ, మధుమణి, సూర్య శ్రీనివాస్, రవి శివతేజ, KGF బాలకృష్ణ, రజిత, మిర్చి కిరణ్ మరియు ఇతరులు నటించారు.
ఆర్ఆర్ ధృవన్ సంగీతం సమకూర్చగా, సతీష్ ముత్యాల ఛాయాగ్రహణం అందించారు, విజయ భాస్కర్ క్రాఫ్ట్స్ పతాకంపై కె. విజయ్ భాస్కర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.