ఈటీవీ విన్ నుండి మరో చిత్రం రేపటి వెలుగు 21 నవంబర్ 2024న రిలీజ్ అవడానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతానికి, ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు అలాగే ఈ సినిమా ఒక యాక్షన్ డ్రామాగా ప్రచారం చేయబడింది.
రేపటి వెలుగు సినిమాలో శత్రు, ప్రశాంత్ కార్తీ, విస్మయ శ్రీ, అద్విక్ బండారు తదితరులు నటించారు. రక్ష వీరన్ చిత్రానికి దర్శకత్వం వహించారు.
అద్భుతమైన కంటెంట్ తో వస్తున్న ఈటీవీ విన్‌ను అభినందించాలి. రేపటి వెలుగు గురించి పెద్దగా సమాచారం లేదు, కానీ పోస్టర్ ఆధారంగా, అది ఒక యాక్షన్ డ్రామా గా అనిపిస్తుంది.
రేపటి వెలుగులో దాదాపు అందరు కొత్త ముఖాలు ఉన్నాయి, వారి ప్రతిభను ప్రదర్శించడానికి ఇది గొప్ప అవకాశం. నటీనటులు తమ నటనతో మెప్పించి మరిన్ని అవకాశాలు అందుకోవాలని ఆశిద్దాం.