హెబ్బా పటేల్ నటించిన “సందేహం” సినిమా జూన్ 2024లో థియేటర్లలో విడుదలైంది, అయితే ఆ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
ఐదు నెలల తర్వాత ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రాబోతోంది. సందేహం చిత్రం 28 నవంబర్ 2024న ఈటీవీ విన్‌లో రిలీజ్ కి సిద్ధంగా ఉంది.
ఈ చిత్రంలో సుమన్ వూట్కూర్, హెబ్బా పటేల్, శ్వేత వర్మ, సుభాశ్రీ తదితరులు నటించారు. సతీష్ పరమవేద ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
ఈ చిత్రానికి ప్రవీణ్ వనమాలి ఛాయాగ్రహణం, సుభాష్ ఆనంద్ సంగీతం అందించగా, సత్యనారాయణ పర్చా నిర్మించారు.
హెబ్బా పటేల్ వరుసగా సినిమాలు చేస్తోంది, ఆమె ఇటీవల ధూమ్ ధామ్ సినిమా లో కనిపించింది. ఆమెకు వల్లన్, ఆద్య, ఒదెల 2 వంటి సినిమాల లో నటించింది.