తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉత్తమ నటులలో సుధీర్ బాబు ఒకరు. ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ, అతను బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంటాడు అది కూడా ప్రయోగాత్మక సినిమాలు.
ఇటీవల థియేటర్లలోకి వచ్చి యావరేజ్ రెస్పాన్స్ అందుకున్న సినిమాల్లో మా నాన్న సూపర్ హీరో ఒకటి. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధం గా ఉంది.
మా నాన్న సూపర్ హీరో సినిమా నవంబర్ 15, 2024న Zee5లో రిలీజ్ అవుతుంది. ఈ చిత్రం ప్రధానంగా తండ్రీకొడుకుల భావోద్వేగాల గురించి ఉంటుంది కానీ విభిన్నంగా ఉంటుంది.
ఈ చిత్రంలో సుధీర్ బాబు, సాయాజీ షిండే, సాయి చంద్, ఆమని, చంద్ర వెంపటి, అన్నీ, ఆర్నా, రాజు సుందరం, శశాంక్ తదితరులు నటించారు.
ఈ చిత్రానికి అభిలాష్ కంకర దర్శకత్వం వహించగా, సమీర్ కళ్యాణి ఛాయాగ్రహణం నిర్వహించగా, జై క్రిష్ సంగీతం అందించగా, సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మించారు.