కొన్ని చిన్న-బడ్జెట్ సినిమాలు అన్ని భాషలలో విడుదల అవుతాయి, కానీ అవి కొన్ని కారణాల వల్ల గుర్తించబడవు. అయితే అలాంటి సినిమాలకి కొన్ని OTT ప్లాట్‌ఫామ్‌లు వరంగా మారాయి, ఎందుకంటే సినిమా ఎలా ఉన్న సరే వాటిని ఆ OTT ప్లాట్‌ఫామ్‌లు తీసుకుని ప్రీమియర్ చేస్తాయి, వీటిని కొంతమంది సినీ ప్రేమికులు చూడవచ్చు.
“రేవు” ఆగష్టు 2024లో విడుదలైన అటువంటి చలనచిత్రం, కానీ అదే రోజు అనేక సినిమాల విడుదల వల్ల గుర్తించబడలేదు. ఈ చిత్రం ఇప్పుడు ఆహా వీడియో ప్లాట్‌ఫామ్‌లో నవంబర్ 15, 2024న రిలీజ్ అవుతుంది.
ఈ సినిమాలో వంశీరామ్ పెండ్యాల, స్వాతి భీమిరెడ్డి ప్రధాన పాత్రలు పోషించారు. హరినాథ్ పులి దర్శకుడు.
సంహిత్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డా.మురళీ చంద్ గింజుపల్లి, నవీన్ పారుపల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు. వైశాఖ్ మురళీధరన్ సంగీతం అందించగా, రేవంత్ సాగర్ ఛాయాగ్రహణం.