వీరమారి ఆఫీస్ పేరుతో తమిళంలో ఓ సిరీస్ వచ్చింది, ఈ సిరీస్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు ఆహా తమిళంలో వీరమారి ఆఫీస్ సీజన్ 2 స్ట్రీమింగ్ అవుతుంది.
ఇక ఇప్పుడు, ఈ సిరీస్ తెలుగులో వేరే లెవెల్ ఆఫీస్ పేరుతో రీమేక్ చేసారు. వేరే లెవెల్ ఆఫీస్ నవంబర్ 28, 2024న ఆహా వీడియోలో రిలీజ్ కి సిద్ధంగా ఉంది.
వేరే లెవెల్ ఆఫీస్ లో అఖిల్ సార్థక్, వసంతిక, శుభశ్రీ, రీతు చౌదరి, మిర్చి కిరణ్, RJ కాజల్, మహేష్ విట్టా, మహేందర్ మరియు ఇతరులు నటించారు.
IT బ్యాక్‌డ్రాప్ సినిమాలు మరియు సిరీస్‌లు తెలుగులో చాలా అరుదు, ఈ వేరే లెవెల్ ఆఫీస్ సిరీస్ IT కుర్రాళ్లతో కనెక్ట్ అయ్యేటట్లు కనిపిస్తోంది. మరి ఈ సిరీస్ ఎలా ఉంటుందో చూద్దాం.