వరుణ్ తేజ్ తెలుగు చిత్ర పరిశ్రమలోని అత్యుత్తమ నటులలో ఒకడు, ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ, అతను కొత్త కొత్త కథలతో ముందుకు వెళ్తున్నాడు.
వరుణ్ తేజ్ తాజా చిత్రం మట్కా థియేటర్లలో విడుదలైంది, అతను తన కెరీర్‌లో ఎప్పుడూ చేయని మూడు విభిన్న పాత్రలను పోషించాడు.
మట్కా సినిమా డిజిటల్ హక్కుల గురించి ఒక బ్రేకింగ్ న్యూస్ రిలీజ్ అయింది. మట్కా సినిమా OTT రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాట్‌ఫామ్ కొనుగోలు చేసుకుంది.
ఈ చిత్రం డిసెంబర్‌లో ప్రైమ్ వీడియోలో వచ్చే అవకాశం ఉంది, చాలా వరకు ఈ చిత్రాన్ని క్రిస్మస్ సందర్భంగా విడుదల చేస్తారు.
ఈ చిత్రంలో వరుణ్ తేజ్ తో పాటుగా మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి, నవీన్ చంద్ర తదితరులు నటించారు. కరుణ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు, ఎ కిషోర్ కుమార్ కెమెరా హ్యాండిల్ చేశారు, వైరా ఎంటర్టైన్మెంట్స్, SRT ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల మరియు రజనీ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.