యువ నటుడు సాయి రోనక్ నటించిన లగ్గం చిత్రం అక్టోబర్ 25న థియేటర్లలో విడుదలైంది, కానీ ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
ఇక ఇప్పుడు లగ్గం సినిమా ఆహా వీడియోలో నవంబర్ 22, 2024న ప్రీమియర్ కి సిద్ధం గా ఉంది. లగ్గం సినిమా తెలంగాణ లో జరిగే వివాహాలు అలాగే వారి సంస్కృతిని చెప్పే కామెడీ-డ్రామా.
ఈ చిత్రంలో సాయి రోనక్‌తో పాటు ప్రజ్ఞానాగ్రా, రాజేంద్ర ప్రసాద్, రోహిణి, రఘుబాబు, ఎల్.బి. శ్రీరామ్ తదితరులు నటించారు.
రమేష్ చెప్పాల రచన & దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంగీతం చరణ్ అర్జున్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మణిశర్మ, ఎంఎన్ బాల్ రెడ్డి సినిమాటోగ్రాఫర్, వేణు గోపాల్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.