టాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి, బ్రిలియంట్ ఫిల్మ్ మేకర్ మోహన కృష్ణ ఇద్రగంటి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘సారంగపాణి జాతకం’.
ప్రియదర్శి, మోహన కృష్ణ ఇద్రగంటి కాంబినేషన్ లో సినిమాని ప్రకటించడం తో అందరి దృష్టిని ఆకర్షించింది. మరి ఇప్పుడు దాని టీజర్‌తో సారంగపాణి జాతకం ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూసే సమయం వచ్చింది.
సారంగపాణి జాతకం టీజర్ నవంబర్ 21, 2024న ఉదయం 11:12 గంటలకు విడుదల అవుతుందని ప్రకటించారు దర్శకనిర్మాతలు.
ఈ చిత్రంలో ప్రియదర్శి, రూప కొడువాయూర్, వీకే నరేష్, తనికెళ్ల భరణి, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, వైవా హర్ష, శివన్నారాయణ, అశోక్ కుమార్, రాజా చెంబోలు, వడ్లమాని శ్రీనివాస్, ప్రదీప్ రుద్ర, రమేష్ రెడ్డి, కల్పలత, రూప లక్ష్మి, హర్షిణి, కేఎల్‌కే మణి, ‘ఐమాక్స్’ వెంకట్ నటిస్తున్నారు.
ఈ చిత్రానికి మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం, పిజి విందా ఛాయాగ్రహణం, వివేక్ సాగర్ సంగీతం అందించగా, శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.