నీది నాది ఒకే కథ, విరాట పర్వం చిత్రాల దర్శకుడు వేణు ఉడుగుల “రాజు వెడ్స్ రాంబాయి” తో నిర్మాతగా మారాడు.
మేకర్స్ ఈ చిత్రం యొక్క మొదటి గ్లిమ్స్ రిలీజ్ చేసారు, గ్లిమ్స్ చూసాక ఇది తెలంగాణ పల్లెటూరు ఇల్లందులో జరిగే ప్రేమకథగా అనిపిస్తుంది.
ఈటీవీ విన్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించింది వేణు ఉడుగుల, రాహుల్ మోపిదేవి. ఈ చిత్రానికి సాయిలు కంపాటి దర్శకత్వం వహించారు. అయితే “రాజు వెడ్స్ రాంబాయి” OTT హక్కులను ETV విన్ సొంతం చేసుకుంది.
రాజు వెడ్స్ రాంబాయి ఫిబ్రవరి 14, 2025న థియేటర్లలోకి రానుంది, కొన్ని వారాల తర్వాత ఈ చిత్రం ETV విన్‌లో అందుబాటులోకి వస్తుంది.
సురేష్ బొబ్బిలి సంగీతం అందించగా, వాజిద్ బేగ్ సినిమాటోగ్రఫీ, నరేష్ అడుప ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.