యువ నటుడు కిరణ్ అబ్బవరం కంటెంట్‌ను గట్టిగా నమ్మడంతో, ‘క’ చిత్రాన్ని దూకుడుగా ప్రమోట్ చేశాడు.
అదృష్టవశాత్తూ, “క” చిత్రం బాక్సాఫీస్ వద్ద చాలా బాగా ఆడింది అలాగే కిరణ్ కెరీర్ లో 50 కోట్ల క్లబ్‌లోకి చేరిన మొదటి చిత్రంగా నిలిచింది.
థియేటర్ విడుదల నుండి చాలా ప్రశంసలు అందుకున్న తరువాత, ఇక ఇప్పుడు ఈ చిత్రం OTT లో రిలీజ్ కి సిద్ధంగా ఉంది.
క చిత్రం నవంబర్ 28, 2024న ETV విన్‌లో రిలీజ్ అవుతుంది. ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరంతో పాటు నయన్ సారిక, తన్వి రామ్, అచ్యుత్ కుమార్, రెడిన్ కింగ్స్లే, అజయ్, శరణ్య ప్రదీప్, తదితరులు నటించారు.
ఈ చిత్రానికి రచన మరియు దర్శకత్వం: సుజిత్ & సందీప్, కెమెరా: విశ్వాస్ డేనియల్ & సతీష్ రెడ్డి మాసం, సామ్ C.S సంగీతం అందించారు, మరియు చిత్రాన్ని చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మించారు.