Valimai Boxoffice Collection: తల అజిత్ వాలిమై మూవీ ప్రపంచవ్యాప్తంగా అన్ని థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయి మంచి కలెక్షన్లతో దూసుకెళ్లిపోతుంది. ఈ సంక్రాంతికి తెలుగులో కొన్ని పెద్ద సినిమాలు వాయిదా పడినప్పటికీ “వాలిమై” అనుకున్న డేట్ కు రిలీజ్ అయింది. తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా 20కోట్లకు పైగా వసూలు చేసింది. వారంలోనే 50 కోట్ల కలెక్షన్స్ క్రాస్ చేసే రేంజ్ లో వాలిమై టాక్ వినిపిస్తోంది.
Valimai Boxoffice Collection Worldwide Day wise (వాలిమై బాక్సాఫీస్ కలెక్షన్ వరల్డ్ వైడ్ డే వైజ్)
Day | Net Collection |
---|---|
Day 1 | 30. 6 కోట్లు |
Day 2 | 27.4 కోట్లు |
Day 3 | |
Day 4 | |
Day 5 | |
Day 6 | |
Day 7 | |
Total | 58. 6 కోట్లు |
State | Day 1 Collection |
---|---|
Ap & Telangana | 11 కోట్లు |
Tamilnadu | 35 కోట్లు |
Hindi version | 12 కోట్లు |
India Net Collection | 58 కోట్లు |
వాలిమై మూవీకు హెచ్ వినోద్ కథను రాయడంతో పాటు ఆయనే దీనికి దర్శకత్వం వహించారు. బోనీ కపూర్ ఈ సినిమాను బేవ్యూ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పీ బ్యానర్ పై నిర్మించారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని సమకూర్చగా, నీరవ్ షాహ్ సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేశారు. విజయ్ వెలుకుట్టి ఎడిటింగ్ చేశారు. అజిత్ కుమార్, హుమా కురేషి, కార్తిక్ గుమ్మకొండ ప్రధాన పాత్రలో నటించారు. కథ విషయానికి వస్తే.. బైక్ రేసర్ల దొంగతనాలను, హత్యలకు అడ్డుకట్టవేసే IPS ఆఫీసర్ పాత్రలో అజిత్ నటించారు. విలన్ పాత్రలో కార్తిక్ గుమ్మకొండ కనిపించారు.
Valimai Prerelease Business (వాలిమై ప్రీ రిలీజ్ బిజినెస్)
వాలిమై మూవీని 150 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానుండడంతో హిందీ రైట్స్ ను 5 కోట్లకు సేల్ చేశారు. తమిళనాడు థియేటర్ రైట్స్ ను 65 కోట్లకు అమ్మేశారు. ఓవర్ సీస్ రైట్సను 15 కోట్లకు, మ్యూజిక్ రైట్స్ ను 5 కోట్లకు, డిజిటల్ రైట్స్ ను మరో 70 కోట్లకు అమ్మేశారు. ఇలా వాలిమై మూవీ విడుదలకు ముందే 220 కోట్లను రాబట్టుకుంది. అంటే సుమారు 60 కోట్లను రిలీజ్ కాకముందే ప్రాఫిట్ గా రాబట్టుకుంది వాలిమై అజిత్ “వాలిమై” చిత్రం.