దీపావళి సందర్భంగా థియేటర్లలోకి వచ్చిన లక్కీ భాస్కర్ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 100 కోట్లు వసూలు చేసింది.
ఇక ఇప్పుడు లక్కీ భాస్కర్ సినిమా నవంబర్ 28, 2024న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అవుతుంది. తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదల అవుతుంది.
ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి, మానస చౌదరి, హైపర్ ఆది, రాజ్‌కుమార్ కసిరెడ్డి, రాంకీ, సచిన్ ఖేడేకర్, సాయి కుమార్, రఘుబాబు, ప్రభాస్ శీను, మాగంటి శ్రీకాంత్ తదితరులు నటించారు.
ఈ చిత్రానికి దర్శకత్వం వెంకీ అట్లూరి, నిమిష్ రవి ఛాయాగ్రహణం, మరియు సంగీతం జివి ప్రకాష్ కుమార్ అందించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ & ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై నాగ వంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు.