హరికథ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవలే విడుదలై ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. అయితే ఇప్పుడు హాట్‌స్టార్ “హరికథ” విడుదల తేదీని ప్రకటించింది.
డిసెంబర్ 13, 2024న సిరీస్ ప్రసారం ప్రారంభమవుతుందని హాట్‌స్టార్ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటివరకు మైథాలజీ నేపథ్య వెబ్ సిరీస్ తెలుగులో కనిపించలేదు, ఈ హరికథ మొదటిది అవుతుంది.
ఈ ధారావాహికలో శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, దివి, పూజిత పొన్నాడ, మౌనిక రెడ్డి, రుచిర సాదినేని, శ్రియ కొట్టం, అర్జున్ అంబటి, MS విక్రమ్ సవ్యసాచి మరియు తదితరులు నటించారు.
మ్యాగీ ఈ ప్రాజెక్ట్‌కి దర్శకత్వం, విజయ్ ఉలగనాథ్ సినిమాటోగ్రాఫర్, సురేష్ బొబ్బిలి సంగీతం సమకూర్చారు మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వప్రసాద్ ప్రాజెక్ట్ నిర్మించారు.
మైథాలజీ మరియు డ్రామా మిక్స్ చేసిన ఈ హరికథ విజువల్ ట్రీట్‌గా ఉంటుందని భావిస్తున్నారు.