యువ నటుడు నిఖిల్ సిద్దార్థ్ ఇటీవలి సినిమా “అప్పుడో ఇప్పుడో ఇప్పుడు” ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయింది.
మూవీ టీమ్ సరిగా ప్రమోట్ చేయకపోవడంతో సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేకపోయింది. ఈ చిత్రంలో నిఖిల్‌తో పాటు రుక్మిణి వసంత్, దివ్యాంశ కౌశిక్, హర్ష చెముడు తదితరులు నటించారు.
సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు. సంగీతం: కార్తీక్, సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ప్రసాద్, ఎడిటింగ్: నవీన్ నూలి, నిర్మాత: BVSN ప్రసాద్ మరియు సహ నిర్మాతలు: యోగేష్ సుధాకర, సునీల్ షా, రాజా సుబ్రమణియన్.
ఎవరైనా థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయితే, అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడటం మిస్ అవ్వకండి. ఓటీటీలో ఈ సినిమా ఎలా రాణిస్తుందో చూడాలి.