టోవినో థామస్ నటించిన నారదన్ చిత్రం 2022 లో విడుదలైంది. అయితే రెండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ చిత్రం తెలుగులోకి రాబోతోంది.
థియేటర్లలోకి రావట్లేదు కానీ OTT లోకి వస్తుంది. నారదన్ సినిమా ఆహా వీడియోలో నవంబర్ 29, 2024న ప్రీమియర్ అవుతుంది.
టోవినో థామస్‌తో పాటు, ఈ చిత్రంలో అన్నా బెన్, ఇంద్రన్స్, రెంజీ పనికర్, ఎస్ షరాఫ్ యు ధీన్, రాజేష్ మాధవన్, నవాస్ వల్లికున్ను మరియు తదితరులు నటించారు.
ఆషిక్ అబు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే మరియు సంభాషణలను ఉన్ని ఆర్ అందించారు. జాఫర్ జాదిక్ కెమెరా హ్యాండిల్ చేయగా, డిజె శేఖర్ సంగీతం సమకూర్చారు. సంతోష్ కురువిల, రిమా కల్లింగల్, ఆషిక్ అబు ఈ చిత్రాన్ని నిర్మించారు.
టోవినో థామస్ ఎవరన్నది కొన్ని తెలుగు డబ్బింగ్ సినిమాల తో తెలుగు ప్రేక్షకులకు తెలిసినప్పటికీ, ఈ నారధన్ సినిమా ను ఎలా ఆదరిస్తారో చూడాలి.