శివకార్తికేయన్ ఇటీవలి సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ బ్లాక్ బస్టర్ సినిమా OTT లో రిలీజ్ కి సిద్ధంగా ఉంది.
అమరన్ డిసెంబర్ 04, 2024న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్‌కి సిద్ధంగా ఉంది. అమరన్ తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో అందుబాటులో ఉంటుంది.
ఈ చిత్రంలో శివకార్తికేయన్‌తో పాటు సాయి పల్లవి, రాహుల్ బోస్, భువన్ అరోరా తదితరులు నటించారు. రాజ్‌కుమార్ పెరియసామి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
జి వి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చగా, సిహెచ్ సాయి ఛాయాగ్రహణం అందించగా, ఆర్. కలైవణ్ణన్ ఎడిటింగ్, కమల్ హాసన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, ఆర్. మహేంద్రన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.