అప్పట్లో, వరుణ్ తేజ్ రిజల్ట్స్ తో సంబంధం లేకుండా మంచి మంచి స్క్రిప్ట్స్ ని సెలెక్ట్ చేసుకునేవాడు, కానీ గత కొన్ని సంవత్సరాల నుండి పూర్ స్క్రిప్ట్ సెలెక్షన్స్ తో ప్లాప్ లని చవిచూస్తున్నాడు.
అందులో భాగంగా ఈ మధ్య వచ్చిన మట్కా చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. ఇక ఇప్పుడు రెండు వారాల్లో, ఈ చిత్రం OTTకి వస్తోంది. మట్కా ప్రైమ్ వీడియోలో డిసెంబర్ 05, 2024న రిలీజ్ అవుతుంది.
ఈ చిత్రంలో వరుణ్ తేజ్, మీనాక్షి చౌదరి, నవీన్ చంద్ర, నోరా ఫతేహి, కన్నడ కిషోర్, అజయ్ ఘోష్, రూపలక్ష్మి, విజయరామరాజు, జగదీష్, రాజ్ తిరందాస్, మైమ్ గోపి మరియు ఇతరులు నటించారు.
ఈ చిత్రానికి కరుణ కుమార్ దర్శకత్వం వహించగా, జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఎ. కిషోర్ కుమార్ కెమెరా హ్యాండిల్ చేశారు.
వైరా ఎంటర్‌టైన్‌మెంట్ మరియు SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డా. విజయేందర్ రెడ్డి తీగల మరియు రజనీ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.