ప్రఖ్యాత మలయాళ నిర్మాత అమల్ నీరద్ దర్శకత్వం వహించిన బౌగెన్‌విల్లా OTT లో రిలీజ్ కి సిద్ధంగా ఉంది.
బౌగెన్‌విల్లా డిసెంబర్ 13, 2024న సోనీలివ్ లో ప్రీమియర్ అవుతుంది. ఈ చిత్రం మలయాళం లోనే కాకుండా తెలుగు, తమిళం, కన్నడ మరియు హిందీ భాషలలో కూడా రిలీజ్ చేస్తున్నారు.
కుంచాకోబోబన్, జ్యోతిర్మయి, ఫహద్ ఫాసిల్, షరాఫ్ యు దీన్, విజిలేష్ కరాయద్, వీణా నందకుమార్, జిను జోసెఫ్, శోభి తిలకన్ తదితరులు నటించారు.
ఈ థ్రిల్లర్‌కు అమల్ నీరద్ దర్శకత్వం వహించగా, సుశిన్ షేమ్ సంగీతం అందించాడు. ఈ చిత్రానికి వివేక్ హర్షన్ ఎడిటర్, మరియు ఆనంద్ సి. చంద్రన్ కెమెరా హ్యాండిల్ చేశారు, జ్యోతిర్మయి, కుంచాకోబోబన్ నిర్మించారు.