ఒకప్పుడు కొత్తగా వచ్చే దర్శకులకు హార్రర్ కామెడీ జానర్ ఫస్ట్ ఆప్షన్ గా ఉండేది ఎందుకంటే తక్కువ బడ్జెట్ లోనే తీయొచ్చు. కానీ ఇప్పుడు అలా కాదు కొత్తగా వచ్చే వాళ్ళు కూడా పెద్ద బడ్జెట్ తో కూడా సినిమాలు చేస్తున్నారు. అలా వచ్చిందే తమిళ్ హార్రర్ కామెడీ సినిమా “ఓ మై గోస్ట్”.
ఈ చిత్రానికి తమిళంలో పెద్దగా ఆడకపోయినా, ఇటీవలే తెలుగులో “మందిర” టైటిల్‌తో డబ్ చేయబడింది. ఇక ఇప్పుడు డిసెంబర్ 05, 2024న ఆహ వీడియో ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ కి సిద్ధం గా ఉంది.
నటి సన్నీలియోన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో సతీష్, యోగి బాబు, దర్శ గుప్తా, రమేష్ తిలక్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
ఆర్.యువన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. విజన్ మూవీ మేకర్స్ పతాకంపై సాయి సుధాకర్ కొమ్మాలపాటి తెలుగు వెర్షన్‌ను నిర్మించారు. జావేద్ రియాజ్ సంగీతం సమకూర్చగా, దీపక్ డి. మీనన్ ఛాయాగ్రహణం.