ఈటీవీ విన్ తన ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ చేయడానికి కొత్త కొత్త కంటెంట్ ఎంపికతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. అలాగే ఇప్పుడు వాళ్లు తమ కొత్త ప్రాజెక్ట్ అయినా “కానిస్టేబుల్ కనకం”తో ప్రేక్షకులను మళ్లీ ఆశ్చర్యపరిచేందుకు సిద్ధంగా ఉన్నారు.
ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయిన వెంటనే, ఈటీవీ విన్ ఈ చిత్రం OTT విడుదల తేదీని ప్రకటిస్తుంది.
ఈ చిత్రంలో నటి వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్ర పోషిస్తుండగా, నటుడు రాజీవ్ కనకాల మరో కీలక పాత్రలో కనిపించనున్నారు.
ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకుడు. కోవెలమూడి సత్య సాయిబాబా, వేటూరి హేమంత్ కుమార్ నిర్మాతలు. సురేష్ బొబ్బిలి సంగీతం సమకూర్చగా, శ్రీరామ్ ముక్కుపాటి సినిమాటోగ్రాఫర్.