ఈ మధ్య రిలీజ్ అయిన తెలుగు చిత్రం “రోటి కపడా రొమాన్స్” నవంబర్ 28, 2024న థియేటర్లలో విడుదలైంది, అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విఫలమైంది.
ఇక ఇప్పుడు ఈ సినిమా రెండు వారాల్లోనే ఓటీటీలోకి రానుంది. రోటి కపడా రొమాన్స్ డిసెంబర్ 12, 2024న ఈటీవీ విన్‌లో రిలీజ్ అవడానికి సిద్ధంగా ఉంది.
ఈ చిత్రంలో హర్ష నర్రా, సందీప్ సరోజ్, సుప్రజ్ రంగ, తరుణ్, సోను ఠాకూర్, నువేక్ష, మేఘ లేఖ, ఖుష్బూ చౌదరి తదితరులు నటించారు.
విక్రమ్ రెడ్డి రచన మరియు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంతోష్ రెడ్డి ఛాయాగ్రహణం, హర్షవర్ధన్ రామేశ్వర్, ఆర్ ఆర్ ధృవన్, వసంత్ జి. సంగీతం సమకూర్చగా, సన్నీ ఎం.ఆర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. బెక్కం వేణుగోపాల్, సృజన్ కుమార్ బొజ్జం ఈ చిత్రానికి నిర్మాతలు.