రిలీజ్ కి ముందు సంచలనం సృష్టించిన కంగువ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా డిజాస్టర్ అవుతుందని ఎవరూ కూడా అనుకోలేదు.
అద్భుతమైన విజువల్స్, సూర్య యాక్టింగ్ కొంత మంది ప్రేక్షకులను మరియు అభిమానులను ఆకట్టుకున్నాయి, అయితే కథ బలంగా లేకపోవడం సినిమా వైఫల్యానికి ప్రధాన కారణం.
అయితే, ఈ చిత్రం OTT లో రిలీజ్ కి సిద్ధంగా ఉంది. కంగువ ప్రైమ్ వీడియోలో డిసెంబర్ 08, 2024న విడుదలవుతుంది. ఈ చిత్రం తమిళం, తెలుగు, కన్నడ మరియు మలయాళం భాషల్లో అందుబాటులో ఉంటుంది.
ఈ చిత్రంలో సూర్య, దిషా పటాని, బాబీ డియోల్, యోగి బాబు, రెడిన్ కింగ్స్లే, కోవై సరళ, హరీష్ ఉత్తమన్ మరియు ఇతరులు ముఖ్యమైన పాత్రలు పోషించారు.
ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహించగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, వెట్రి పళనిసామి కెమెరా హ్యాండిల్ చేసారు. కె.ఇ. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై జ్ఞానవేల్‌రాజా ఈ చిత్రాన్ని నిర్మించారు.