విశ్వక్ సేన్ “మెకానిక్ రాకీ” సినిమా నవంబర్ లో థియేటర్ లలో విడుదల అయింది. ఈ సినిమా విజయం గురించి చాలా నమ్మకంగా కనిపించాడు విశ్వక్ సేన్, అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది.
ఈ సినిమా క్లైమాక్స్ లో షాకింగ్ ట్విస్ట్‌లు ఉన్నప్పటికీ, ఎగ్జిక్యూషన్ ప్రేక్షకులను థియేటర్లలో ఎంగేజ్ చేయడంలో విఫలమైంది. ఈ చిత్రం ఇప్పుడు డిసెంబర్ 13, 2024 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాట్‌ఫామ్‌లో తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళం ఆడియోలలో రిలీజ్ అయింది.
ఈ సినిమా OTT విడుదల తేదీ గురించి ముందస్తు ప్రకటన ఏమి ఇవ్వలేదు. ఈ చిత్రంలో విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్, సునీల్, నరేష్ VK, హైపర్ ఆది, హర్ష వర్ధన్, వైవా హర్ష మరియు రఘురామ్ తదితరులు నటించారు.
రవితేజ ముళ్లపూడి రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రజనీ తాళ్లూరి నిర్మించారు. జేక్స్ బిజోయ్ సంగీతం సమకూర్చగా, మనోజ్ రెడ్డి కటసాని కెమెరా హ్యాండిల్ చేశారు.