యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల నటించిన “పొట్టేల్” చిత్రం థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల నుండి మంచి స్పందనను అందుకుంది.
ఇప్పుడు ఎలాంటి ప్రకటన లేకుండానే ప్రైమ్ వీడియో సినిమాను విడుదల చేసింది. ఒకవేళ మీరు థియేటర్‌లో ఈ సినిమాను మిస్ అయితే ఇప్పుడు ప్రైమ్ వీడియోలో చూడవచ్చు.
ఈ చిత్రంలో యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్లతో పాటు అజయ్ కీలక పాత్ర పోషించారు. నోయల్, ప్రియాంక శర్మ కీలక పాత్రల్లో కనిపించారు.
సాహిత్ మోత్ఖూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు, మోనిష్ భూపతి రాజు కెమెరా హ్యాండిల్ చేసారు, మరియు శేఖర్ చంద్ర సంగీతం సమకూర్చారు. నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగే ఈ చిత్రాన్ని నిర్మించారు.