TVF క్రియేషన్ సిరీస్‌లు భారతదేశంలో అత్యంత ఇష్టపడే సిరీస్, ఎందుకంటే వాటిలో చాలా వరకు సాధారణ ప్రేక్షకుల రోజువారీ జీవితంలో ఉండే పాత్రలు మరియు సందర్భాలు ఉంటాయి. “క్యూబికల్స్” అనేది IT ఉద్యోగుల జీవితాలను, మరియు సంస్థలో వారు ఎదుర్కొనే పోరాటాలతో ప్రదర్శించిన సిరీస్.
3 విజయవంతమైన సీజన్‌ల తర్వాత, Cublicles సీజన్ 4 ఇప్పుడు Sony Liv OTT ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమ్ అవుతుంది.
అయితే విడుదల తేదీని ప్రకటించినప్పుడు ఒక్క హిందీ లోనే వస్తున్నట్టు ప్రకటించారు కానీ ఎలాంటి ప్రకటన లేకుండా ఇప్పుడు తెలుగు లో కూడా వచ్చేసింది.
ఈ సిరీస్ లో అభిషేక్ చౌహాన్, నికేతన్ శర్మ, ఆయుషి గుప్తా, కేతకీ కులకర్ణి, నిమిత్ కపూర్, జైన్ మేరీ ఖాన్, శివన్‌కిత్ సింగ్ పరిహార్, బద్రీ చవాన్ మరియు ఖుష్బు బైద్ నటించారు.
చైతన్య కుంభకోణం దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ని అరుణాభ్ కుమార్ నిర్మించారు. అవినాష్ సింగ్, విజయ్ వర్మ, ఆదర్శ్ జాన్‌పురి, చేతన్ డాంగే మరియు అనురాగ్ శుక్లా రచయితలు.