జియో సినిమా OTT ప్లాట్‌ఫామ్ లో ఎన్ని కొత్త సినిమాలు మరియు సిరీస్ లు వచ్చినప్పటికీ వీక్షకులు మాత్రం ఏదైనా క్రికెట్ లేదా ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లు ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువగా చూస్తారు.
అయినప్పటికీ, జియో సినిమా టీమ్ వెనక్కి తగ్గడం లేదు అలాగే వారి ప్లాట్‌ఫామ్‌లో చూడటానికి తగినంత కంటెంట్ ఉంచారు. ఇప్పుడు వారు “మూన్‌వాక్” అనే కొత్త సిరీస్‌ను అన్ని భాషల్లో రిలీజ్ చేసారు.
ఈ సిరీస్ లో అన్షుమాన్ పుష్కర్, సమీర్ కొచ్చర్, నిధి సింగ్, నేహా చౌహాన్, షీబా చద్దా, గీతాంజలి కులకర్ణి మరియు అనిల్ చరంజీత్ నటించారు.
అజయ్ భుయాన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ను జార్ పిక్చర్స్‌తో కలిసి జియో స్టూడియోస్ బ్యానర్‌పై జ్యోతి దేశ్‌పాండే నిర్మించారు. స్నేహ ఖాన్వాల్కర్ సంగీతం సమకూర్చారు.