Valimai Review: వాలిమై చిత్రం విడుదలైన కొన్ని నిమిషాలకే ఎక్కడ చూసినా సినిమా అదిరిపోయింది, ఈ సంక్రాంతికి ఇదే సూపర్ హిట్, అజిత్ మరోసారి తల అజిత్ అనిపించుకున్నాడు అంటూ ఫ్యాన్స్, మూవీలవర్స్ చెబుుతున్నారు. వాలిమై మూవీ అనుకున్నట్లుగానే మంచి కలెక్షన్స్ రాబడుతోంది. ఒక వైపు కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నా ప్రేక్షకులు కోవిడ్ నిబంధనలను పాటిస్తూ థియేటర్లలో సినిమాను చూడడానికి వస్తున్నారు.
వాలిమై తారాగణం, కథ
వాలిమై చిత్రానికి హచ్ వినోద్ కథను అందించడంతో పాటు ఆయనే దీనికి దర్శకత్వం వహించారు. బోనీకపూర్ 150కోట్లతో బేవ్యూ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పీ బ్యానర్ పై దీన్ని నిర్మించారు. యువన్ శంకర్ రాజా, గిబ్రాన్ కలిసి సంగీతాన్ని సమకూర్చారు. అజిత్ కుమార్, హుమా కురేషి, కార్తికేయ గుమ్మకొండ ప్రధాన పాత్రలో కనిపించారు.
వాలిమై మూవీ మొత్తం యాక్షన్, బైక్ రేసింగ్ చూట్టూ తిరుగుతూ ఉంటుంది. విలన్ గా కార్తికేయ బైక్ రేసింగ్ సాయంతో దొంగతనాలు, హత్యలు చేస్తుంటాడు. IPS ఆఫీసర్ గా తల అజిత్ రంగంలోకి దిగి కార్తికేయ ను పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. యాక్షన్ సీక్వెన్సెస్ చాలా ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కించారు. టాలీవుడ్ హీరో కార్తికేయ మొదటి సారి వెలన్ పాత్రలో అద్భతంగా నటించారు.
సినిమా ఎలా ఉందంటే
వాలిమై సినిమా అద్భుతంగా ఉంది. యాక్షన్ జానర్ అయినప్పటికీ మొత్తం కుటుంబ సమేతంగా కలిసి చూడతగ్గ సినిమా. యోగిబాబు కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. సహజంగా అజిత్ బైక్ రేసర్ కాబట్టి, అజిత్ స్టంట్స్ , రేసింగ్ ను నేరుగా చూసే అవకాశం ప్రేక్షకులకు దక్కుతుంది.. ఇక తల అజిత్ అభిమానులకైతే పండగే.
మూవీ రేటింగ్ : 3.5/5
ఇవి కూడా చూడండి: