లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం కొడుకుగా రాజా గౌతమ్ మనందరికీ తెలుసు. అతని “బ్రేక్ అవుట్” సినిమా థియేటర్ లో విడుదల చేయకుండా నేరుగా OTT లో రిలీజ్ అవుతుంది.
ఈ చిత్రం యొక్క ట్రైలర్ రెండేళ్ల క్రితం విడుదల అయింది మరియు టీజర్ రిలీజ్ ఐనప్పటినుండి తరువాత ఎలాంటి అనౌన్స్మెంట్ లేదు. చాలా గ్యాప్ తర్వాత, ఈ చిత్రం నేరుగా OTT లో విడుదలకు సిద్ధం అయింది.
ఇక ఇప్పుడు, జనవరి 09, 2025న ETV విన్ OTT ప్లాట్‌ఫామ్‌లో ప్రీమియర్ కి సిద్ధంగా ఉంది.
ఈ చిత్రం యొక్క ఖచ్చితమైన విడుదల తేదీని ETV విన్ త్వరలో వెల్లడిస్తుంది. రాజా గౌతమ్‌తో పాటు, ఈ చిత్రంలో చక్రపాణి, జి.బాల, కిరీటి దామరాజు, చిత్రం శీను, రమణ భార్గవ్ మరియు ఇతరులు ఉన్నారు.
సుబ్బు చెరుకూరి ఈ చిత్రానికి రచన మరియు దర్శకత్వం వహించగా, సంగీతం M.S జోన్స్ రూపర్ట్, మరియు ఛాయాగ్రహణం మోహన్ చారి. అనిల్ మోదుగ ఫిల్మ్స్ పతాకంపై అనిల్ మోదుగ ఈ చిత్రాన్ని నిర్మించారు.