ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలు గతంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా నిర్మించబడ్డాయి, అలాగే కొన్ని వివాదాలు సృష్టించాయి. అలాంటి వాటిలో ఒకటైన చిత్రమే “రజాకార్”, ఇది నిజాం పాలనలో హైదరాబాద్‌లో జరిగిన కొన్ని సంఘటనలను చిత్రీకరిస్తుంది.
ఈ సినిమా గురించి చాలా వివాదాలు ఉన్నాయి అలాగే కొంతమంది రాజకీయ నాయకులు సినిమా విడుదలను ఖండించారు కూడా. కానీ ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది మరియు ప్రేక్షకుల నుండి ఊహించని స్పందన వచ్చింది. ఈ చిత్రం ఇప్పుడు జనవరి 24, 2025న ఆహా వీడియో ప్లాట్‌ఫామ్‌లో ప్రీమియర్‌కి సిద్ధంగా ఉంది.
రాజ్ అర్జున్, బాబీ సింహా, వేదిక, ప్రేమ, ఇంద్రజ, జాన్ విజయ్, మకరంద్ దేశ్‌పాండే, అనసూయ భరద్వాజ్ మరియు మరికొందరు ప్రముఖ పాత్రలు పోషించారు.
సమర్వీర్ క్రియేషన్స్ LLP బ్యానర్‌పై గూడూరు నారాయణ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి యాట సత్యనారాయణ దర్శకత్వం వహించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చగా, రమేష్ కుశేందర్ కెమెరా హ్యాండిల్ చేసారు.