ఆర్.మాధవన్ నటించిన చిత్రం “హిసాబ్ బరాబర్” ఇప్పటికే కొన్ని చలనచిత్రోత్సవాలలో ప్రీమియర్ అయి గొప్ప ప్రశంసలను అందుకుంది. వాస్తవికత కి దగ్గరగా ఉన్న ఈ చిత్రం త్వరలో థియేటర్లలో విడుదల అవుతుందని భావించారు, కానీ ఇప్పుడు నిర్మాతలు తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు కనిపిస్తోంది.
“హిసాబ్ బరాబర్” చిత్ర బృందం నుండి OTT ప్లాట్‌ఫామ్‌లోకి వస్తున్నట్టు ధృవీకరిస్తూ ఒక కొత్త పోస్టర్ విడుదలైంది, థియేటర్ లో విడుదల అవ్వట్లేదు. ఇది జనవరి 24, 2025న Zee5 OTT ప్లాట్‌ఫామ్‌లో హిందీ, తమిళం మరియు తెలుగు భాషలలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది.
మాధవన్‌తో పాటు, ఈ చిత్రంలో నీల్ నితిన్ ముఖేష్, కృతి కుల్హారి, ఫైసల్ రషీద్, రాజేష్ జైస్, సుకుమార్ టుడు, అక్షయ్ భగత్, రష్మి దేశాయ్, ఇమ్రాన్ హస్నీ మరియు అనిల్ పాండే ఇతర ప్రముఖ పాత్రల్లో నటించారు.
ఈ చిత్రానికి అశ్విని ధీర్ దర్శకుడు, దీనిని SP సినీకార్ప్ బ్యానర్‌లో జియో స్టూడియోస్‌తో కలిసి జ్యోతి దేశ్‌పాండే, శరద్ పటేల్ మరియు శ్రేయాన్షి పటేల్ నిర్మించారు.