హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ నటించిన “100 క్రోర్స్” సినిమా ట్రైలర్ కొన్ని నెలల క్రితం థియేటర్ విడుదల తేదీతో రిలీజ్ చేసారు. కానీ ఈ సినిమా చెప్పిన తేదీన థియేటర్లలో విడుదలైందో లేదో ఎవరికీ తెలియదు.
కానీ ట్రైలర్ విడుదలైన దాదాపు మూడు నెలల తర్వాత, ఈ సినిమా చివరకు OTT విడుదల తేదీని అనౌన్స్ చేసింది. జనవరి 11, 2025న ఆహా వీడియో OTT ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కి సిద్ధంగా ఉంది.
రాహుల్‌తో పాటు, ఈ సినిమాలో చేతన్ కుమార్, అమీ ఏలా, సాక్షి చౌదరి, ఐశ్వర్య భకుని, భద్రం, వాసు ఇంటూరి, శరత్ లోహితాశ్వ, షేకింగ్ శేషు మరియు మరికొందరు నటించారు.
విరాట్ చక్రవర్తి ఈ చిత్రానికి రచయిత మరియు దర్శకుడు. దివిజా కార్తీక్ మరియు సాయికార్తీక్ ఈ చిత్రాన్ని SS స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మించారు. సాయికార్తీక్ సంగీతం సమకూర్చగా, సాయి చరణ్ మాధవనేని కెమెరా హ్యాండిల్ చేసారు.